నవతెలంగాణ బుక్స్ :: నిర్జన వారధి

నిర్జన వారధి(NIRAJANA VARADI)

Author: Kondapalli Koteswaramma

Price: Rs.150.00 /-

No.Pages: 184.

Book Your Orders via Whatsapp

Description:

నిర్జీవంగా ఉన్న సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం.... ధారపోశాక చూడ్డానికి వాళ్ళ పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను... సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం? - కొండపల్లి కోటేశ్వరమ్మ * * * కొండపల్లి కోటేశ్వరమ్మగారు మూడు ఉద్యమాల వారధి. మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాటపటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్ద్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో, అంత సామాజికం, రాజకీయం... - ఓల్గా

About the Author