Price: Rs.75.00 /-
No.Pages: 112.
\"పెట్టుబడి\" గ్రంథం రెండవ సంపుటానికి జాన్ ఫ్రాక్స్ రాసిన పరిచయం ఇది పెట్టుబడి గంథం మొత్తం మూడు సంపుటాలు అయినప్పటికీ ఈ రెండవ సంపుటానికి అంతగా ప్రాధాన్యత లభించ లేదు. కానీ రెండవ సంపుటం కూడ అంతే ప్రాధాన్యత కలది. ఓ రకంగా చూసుకుంటే వాటి కన్నా కూడ ఎక్కువ ప్రాధాన్యత కలిగింది అని చెప్పుకోవచ్చు. ఎందువల్లనంటే, నేడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సుదీర్ఘ సంక్షోభంలో కూరుకొని ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందో పెట్టుబడిదారీ పండితులకు అర్ధం కానున్నది. అసలు దానికి నిజమైన కారణాలేమిటో కూడ వారికి అంతు చిక్కడం లేదు. సంక్షోభాల మర్మం తెలుసుకోవాలంటే దీన్ని అధ్యయనం చేయాల్సిందే. జాన్ ఫ్రాక్స్ రాసిన ఈ పరిచయం ఎంతో క్లుప్తంగా, సూటిగా రెండవ సంపుటం లోని ప్రధాన అంశాలను వివరిస్తున్నది. దీన్ని చదివినపుడు పెట్టుబడి గ్రంధం రెండవ సంపుటం సారాంశం చక్కగా భోదపడుతున్నది.
This Book Was Written By Various Authors