Price: Rs.100.00 /-
No.Pages: .
మొక్కవోని ధైర్యసాహసాలకు, చెక్కుచెదరని ఆతమ్వఇశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ అగ్నిపథం ఒక అసామాన్య వ్యక్తి ఆత్మకథ మాత్రమే కాదు. విజ్ఞాన-సాంకేతిక రంగాలలో స్వావలంబన కోసం స్వతంత్ర భారతదేశం సాగించిన నిరుపమాన కృషికి, సాధనకు, శోధనకు అక్షర రూపం. ఉత్తేజభరితమైన 'వింగ్స్ ఆఫ్ ఫైర్'ను ముఖ్యంగా పిల్లల కోసం సరళమైన భాషలో సంక్షిప్తం చేసి అగ్నిపథంగా అందిస్తున్నాం. ఆ జీవితం....విజయపథం అతిసాధారణ కుటుంబంలోనే జన్మించి, పట్టుదలతో చదివి ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరకు మనదేశంలోనే అత్యున్నత స్ధానానికి చేరుకున్న మన మాజీ రాష్ట్రపతి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆత్మకథ. పిల్లలకు కూడా తేలికగా అర్ధమయ్యేలా ఉన్నది. - ఈనాడు