నవతెలంగాణ బుక్స్ :: లూయీ బోనపార్టీ 18 బ్రుమెర్

లూయీ బోనపార్టీ 18 బ్రుమెర్(LUIE BONAPRTY BRUMAIRE 18th)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 136.

Book Your Orders via Whatsapp

Description:

“నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగుపాటు మాదిరిగా దిగ్ర్భాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే, దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండిచారు. మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారే కాని అర్థంచేసుకున్న వారెవరూ లేరు. అటువంటి ఈ ఘటన జరిగిన వెంటనే మార్క్ దాన్ని సంగ్రహంగా, సునిశిత వ్యంగ్య వైభవంతో వివరించారు. ఆ వివరణ ఫిబ్రవరి రోజుల దరిమిలా యావత్తు (ఫ్రెంచి చరిత్ర క్రమాన్ని దాని అంతస్సంబంధాలతో పాటు తేటతెల్లం చేసి డిసెంబరు 2 నాటి అద్భుతాన్ని ఈ అంతస్సంబంధం యొక్క సహజ, ఆవశ్యక పర్యవసానంగా తేల్చిచెప్పింది. అలా చేసేటప్పుడు రాజకీయ కుట్ర హీరోను, అత్యంత సముచితమైన అసహ్యభావనతో తప్ప మరోవిధంగా చూడాల్సిన అవసరం సైతం ఆయనకు లేకపోయింది. ఆయన చేసిన చేసిన చిత్రణ ఎంత ప్రతిభావంతంగా ఉందంటే, అటుతర్వాత బయటపడిన ప్రతి ఒక్క అంశమూ వాస్తవాన్ని మార్క్ ఎంత యథాతధంగా చిత్రించాడో అన్నదానికి కొత్త రుజువును సమకూర్చింది. సమకాలీన సజీవ చరిత్ర గురించిన వివిష్టమైన ఈ అవగాహనతో పాటు, ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే ఇంత స్పష్టంగా అంచనా వేయడమన్నది నిజంగా సాటిలేని విషయం.” -ఫ్రెడరిక్ ఎంగెల్స్

About the Author

This Book Was Written By Various Authors