Price: Rs.500.00 /-
No.Pages: 535.
రాచరికం, నిరంకుశత్వం, భూస్వామ్యం, చిమ్మచీకటి, దోపిడీ, దౌర్జన్యం.. నిజాం కాలం నాటి తెలంగాణా అంటే ఇవి మాత్రమేనా? ఇక్కడి పాలకుడు ఏ ఒక్క ముందడుగు వేయలేదా? నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఇక్కడ ఏ గొంతులూ ఎలుగెత్తలేదా? కొత్తగాలుల కోసం ఎవరూ కొత్త కిటికీలు తెరవలేదా? ఈ ప్రశ్నలకు జవాబే ఈ పుస్తకం. ఆధునికతలోకి తెలంగాణాను నడిపించడానికి చిన్నచిన్న అడుగులతో మొదలైన నడకే, మహా కవాతుగా రూపుదిద్దుకున్నది. అక్షరాస్యులే అతి తక్కువగా ఉన్న సమాజంలో గ్రంథాలయాలు ఉద్యమకేంద్రాలయ్యాయి. అంబేద్కర్ కంటే ముందే ఒక తెలంగాణ దళిత సంస్కర్త మూలవాసుల సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. పోస్టాఫీసు లేని, రహదారే లేని కుగ్రామంలో ఒక ఉత్సాహి పత్రికను ప్రారంభించాడు. తెలంగాణాలో కవులు లేరని అంటే ఒక సంపాదకుడు కవులసంచికను ప్రచురించి ఆత్మాభిమాన ప్రకటన చేశాడు. సమాజం అడుగులో అడుగువేసి తెలంగాణ అక్షరం చేసిన ప్రయాణవర్ణనే ఈ పుస్తకం.