నవతెలంగాణ బుక్స్ :: వేమన పద్యాలు

వేమన పద్యాలు(Vemana Padyalu)

Author: Dr. N. Gopi

Price: Rs.175.00 /-

No.Pages: 176.

Book Your Orders via Whatsapp

Description:

పారిస్ ప్రతి 1990లో పుస్తక రూపంలో వచ్చింది. అంటే 30 ఏళ్ళ క్రిందట. అప్పట్లో నా థీసిస్ అమ్మకాల పై వచ్చిన డబ్బుతో నేనే అచ్చు వేసుకున్నాను. ఏడాది లోపే ఆ వెయ్యి ప్రతులు చెల్లిపోయాయి. పారిస్ ప్రతి అనే గ్లామర్ కన్నా దాదాపు మూడు శతాబ్దాల క్రితం ఖండాంతరాలకు వెళ్ళిన అపురూపమైన ప్రతి ఇది. వేమన పద్యాల అతి ప్రాచీన ప్రతుల్లో రెండోది. వేమన పద్యాల పరిష్కరణకూ భవిష్యత్పరిశోధనలకూ తిరుగులేని ఆకర గ్రంథంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ దృష్టితో ఇది అచ్చయి ఈతరం జిజ్ఞాసువులకు అందుబాటులో ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే నేటి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేకంగా వేమన సంస్థను స్థాపించి ఒక బృహత్ర్పణాళికను సంకల్పించి అనర్ఘ రత్నాల్లాంటి వేమన పద్యాలను ఆచంద్రార్కం నిలబెట్టే ప్రయత్నం చేయాలని నా ఆకాంక్ష. -డా. ఎన్. గోపి

About the Author