Price: Rs.80.00 /-
No.Pages: 88.
ఆల్బర్ట్ కు కాంతి పనిచేసే తీరుపట్ల ప్రత్యేకమైన ఆసక్తి. ఒకనాడు అతను సరస్సులోని నీళ్లమీద నాట్యం ఆడుతున్న సూర్యుని కాంతులను తీవ్రంగా పరిశీలించాడు. అతని ఆలోచనలు ఒక కొత్త దిశగా మరలి ముందుకు సాగాయి. అతని మనసులో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. ఒక కాంతికిరణంమీద ఎక్కి ప్రయాణించగలిగితే ఎలాగ ఉంటుంది? అని అతనికి అనుమానం మొదలైంది. కాంతికిరణం వెంటపడి పరుగెత్తి తే ఎలా ఉంటుంది? అని కూడా అనిపించింది. నిజంగా అంత వేగంగానూ పరుగెత్తగలిగితే కాంతి కదలని భావం కలుగుతుందా? అన్న ప్రశ్న మెదడులో మెరిసింది. ఈ రకంగా వరుసగా వచ్చిన ప్రశ్నలను అతను ఆలోచనా ప్రయోగాలు అన్నాడు. అవి అతని మనసులో సంవత్సరాల పాటు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. యువ వయసులో పుట్టిన ఈ ఆలోచనలు అతడిని భౌతిక శాస్త్రంలో ముందుకు నడిపించాయి. ప్రపంచానికి ఎన్నో కొత్త అంశాలను అందించాయి. శాస్త్ర విజ్ఞానం నడిచే దారిని ప్రభావితం చేశాయి.