Price: Rs.200.00 /-
No.Pages: 240.
మతం కోసం మనిషి కాదు, మనిషి కోసం మతం ఏర్పడింది మానవీయంగా మారేందుకు మతం వదిలేయాలి సమానత్వం పొందేందుకు మతం వదిలేయాలి జంతువుల స్పర్శను అనుమతిస్తూ మానవుల స్పర్శను నిషేధించే మతం మతం కాదు మూర్ఖత్వం ఒక వర్గాన్ని విద్యకు, సంపదకు దూరం చేసి, బహిష్కరించే మతం - మతం కాదు, దుర్మార్గం। ఎవడికి తోచింది వాడు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని ఇతరుల పై ప్రయోగించే స్వేచ్చ ఎవరికి ఉండదు. నీ ఆలోచన, నీ పక్కవాడికి, నీ సమాజానికి, నీ దేశానికి, మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్చ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణీ కాదు. నీ ఇష్టా ఇష్టాల్ని ఇతరుల పై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది. - దేవరాజు మహారాజు