Price: Rs.225.00 /-
No.Pages: 224.
తీస్తా రాసిన ఈ రాజకీయ జ్ఞాపకాలు ఏం జరిగిందో చెప్పే వాంగ్మూలాలు. ఎప్పుడేం జరిగిందో నమోదు చేసిన పత్రాలు. అనేక విధాల ప్రచారం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఇలాంటి వాస్తవాల ప్రకటన ఎంతైనా అవసరం. ఆమె సమగ్రమైన కథనాన్ని అర్థమయ్యే రీతిలో అందించారు. ఆమె ఆత్మస్టెర్యాన్ని దెబ్బతీయడానికి ఆమె పై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ ఏం జరిగిందో చెప్పే తన పోరాటాన్ని ఆమె కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి పౌరులు మరికొంత మంది ఉంటే ఎంత బాగుండును. – రోమిల్లా థాపర్ - బాధితులకు నష్టపరిహారం కోర్టుల నుంచి లభించేలా చేయాలనుకున్నాను. కాని రాజకీయంగా నాకు అవగాహన పెరిగిన తర్వాత, కేవలం కోర్టుల ద్వారా, న్యాయబద్ధంగా పోరాడ్డమే కాదు, చేయవలసింది ఇంకా చాలా ఉందనిపించింది. న్యాయ పోరాటానికి మద్దతు పలికే చైతన్యం సృష్టించవలసిన అవసరం కూడా ఉంది. చట్టబద్ధంగా, న్యాయస్థానాల ద్వారా తీసుకునే చర్యల ఔచిత్యాన్ని సమర్థించే అవగాహన, చైతన్యం సృష్టించవలసి ఉంది. ప్రభుత్వం, రాజ్యం అదుపాజ్ఞల్లో ఉండే కార్యనిర్వాహక శాఖల అన్యాయాలకు నష్టపరిహారం కోర్టుల ద్వారానే లభించాలన్నది నా అభిప్రాయం. ఈ అభిప్రాయం మరీ అమాయకంగా కొందరికి కనిపించినా సరే. దేశంలో చట్టబద్ధమైన పాలన అనేది పటిష్టమైన తాత్విక పునాదుల పై ఉండాలి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఆ తాత్విక పునాది భారత రాజ్యాంగంలో ఉంది. విద్వేషం కారణంగా జరిగిన అమానుషం, హింసాకాండల్లో బాధితులు కోల్పోయిన ప్రాణాలు, గౌరవమర్యాదలు, ఆస్తులు అన్నింటికి నష్ట పరిహారం న్యాయంగా, నిజాయితిగా ఇప్పించవలసింది కోర్టులే. - తీస్తా సెత్లవాద్