నవతెలంగాణ బుక్స్ :: విజ్ఞాన శాస్త్రం మన జీవన సిద్ధాంతం

విజ్ఞాన శాస్త్రం మన జీవన సిద్ధాంతం(VIGNANA SASTRAM MANA JEEVANA SIDDHANTAM)

Author: Dr. Devaraju Maharaju

Price: Rs.175.00 /-

No.Pages: 184.

Book Your Orders via Whatsapp

Description:

హేతువాద రచయితలు, వైజ్ఞానిక స్పృహ గల సైన్సు కార్యకర్తలు మాత్రమే మనుషుల, సమూహాల, సమాజాల రుగ్మతల్ని పసిగట్టి బహిర్గతం చేయగలరు. హెచ్చరించగలరు. ఈ పని కోసం ప్రభుత్వం వీరిని నియమించకపోవచ్చు గాక, ఈ పని కోసం వారికి ఏ విధమైన ఆదాయం లభించకపోవచ్చు గాక - అయినా బాధ్యత గల ఈ దేశ పౌరులుగా వాళ్ళు - వాళ్ళకై వాళ్ళు నిర్దేశించుకున్న ఆ పని చేస్తూనే ఉంటారు. వారి ఆవేదనలో, వారి ఆక్రోశంలో, వారి నిజాయితీలో, వారి నిబద్ధతలో ఎంత బలం ఉందని చూడాలే గానీ - ప్రశ్నిస్తున్నారనో, హెచ్చరిస్తున్నారనో అణగదొక్కాలని చూస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. సమాజం అనాగరికతలోకి, అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రమాదం తప్పాలంటే వైజ్ఞానిక స్పృహతో విషయాల్ని ఎత్తి చూపే వైజ్ఞానికుల్ని, వైజ్ఞానిక రచయితల్ని, ప్రచారకుల్ని, కార్యకర్తల్ని పోత్సహించాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వారందరి నిస్వార్థ సేవల్ని గుర్తు పెట్టుకోవాలి. సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్, డాక్టర్ దేవరాజు మహారాజు గారు గత యాభై అయిదేళ్ళకు పైగా రచనలు ప్రకటిస్తూనే ఉన్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో ఎనభై మూడు ప్రామాణిక గ్రంథాలను వెలువరించిన ఈ రచయిత, ఐదు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. అందులో ఒకటి వైజ్ఞానిక రచనలకు స్వీకరించింది కూడా ఉంది. సమాజంలో హేతుబద్దత పెంచాలని, సామాన్యుడిలో వైజ్ఞానిక స్పృహ పెరగాలని తపిస్తూ, నిరంతరం తన కలం కొరడా ఝుళిపిస్తున్న నిత్య కృషీవలుడు. ఆ కోవలో రచించిందే ఈ రచన. అదే ఈ ప్రచురణ.

About the Author