నవతెలంగాణ బుక్స్ :: బల్బువెలిగింది

బల్బువెలిగింది (BULB VELIGINDI)

Author: Various

Price: Rs.20.00 /-

No.Pages: 30.

Book Your Orders via Whatsapp

Description:

ఒక పెద్ద మనిషి తన మిత్రుడైన ఒక ప్రొఫెసర్ తో కలిసి మరో మిత్రుడింటికి వెళ్ళాడు. మిత్రుడు మన పెద్ద మనిషికి తినడానికి ఏం మేత పెట్టాడో తెలీదుగానీ మెదడుకు మాత్రం కావాల్సినంత మేత పెట్టాడు. మిత్రుడి ఇంట్లో ఓ ఆర్క్ దీపం వెలుగుతోంది. అది మన పెద్ద మనిషి కంట్లో పడింది. రెండు కర్బన్ కడ్డీలను దగ్గరగా వుంచి వాటిలోకి విద్యుత్తును ప్రసారం చేస్తే ఆర్క్ ఉత్పత్తై వెలుగు ఏర్పడుతుంది. ఇదే ఆర్క్ దీపం. ఈ నమూనా క్రీ.శ. 1800 ప్రాంతంలోనే హంప్రీ డేవిడ్ రూపొందించాడు. అయితే దీంతో వచ్చిన చిక్కేమిటంటే కళ్లకి మిరుమిట్లు గొల్పుతుంది. లాభసాటి కూడా కాదు. ‘ఇంటింటా ఇలాంటి దీపాలు వెలిగే రోజు వస్తే ఎంత బావుణ్ణు’ అని మన పెద్ద మనిషి ఆలోచన మొదలెట్టాడు. అప్పటిదాక యూరప్ లో వాయుదీపాలే వాడుతున్నారు. ఇంతకీ ఈ దీపం ఎలా తయారు కావాలి?

About the Author

This Book Was Written By Various Authors