Price: Rs.35.00 /-
No.Pages: 86.
ఇది మిహైల్ షొలొఖొవ్ రాసిన అత్యంత ప్రసిధ్ధి పొందిన నవల. 1917 నుంచి షొలొఖొవ్ కళ్ళారా చూసి అనుభవించిన జీవితాన్ని నవలగా రాసాడు. రష్యా విప్లవ కాలంలో డాన్ నదీతీరంలో జీవించే కోసక్కుల పూర్వ చరిత్ర, సాంఘీక రాజకీయ చరిత్రలకు అద్దంపట్టిన బృహన్నవల. వర్గాలూ, వర్గపోరాటాలూ అనే పదాలు ఉపయోగించకుండా వర్గాల మధ్య ఉండే అంతరాన్ని అత్యంత విశేషంగా మలచిన నవల. మొదటి ఎనిమిది భాగాలుగా రాసిన ఈ నవల నాలుగు సంపుటాలుగా వెలువడింది. పదిహేనేళ్ళు శ్రమపడి రాసిన ఈ నవల రష్యాలో ఎంతో వివాదానికి దారితీసింది. చివరకు గోర్కీ కలిగించుకోవడం వల్ల ఈ నవల పూర్తిచేయబడింది. ఇప్పటికే ఎన్నో భాషల్లోకి అనువదింపబడింది.