నవతెలంగాణ బుక్స్ :: నా తొలి జీవితం

నా తొలి జీవితం(NA TOLI JEEVITAM)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: 187.

Book Your Orders via Whatsapp

Description:

అమెరికాకు అతి దగ్గరగా ఉండే అతి చిన్న దేశమైన క్యూబాను సోషలిస్టు పథంలో అచంచలంగా నడిపిస్తున్న ఫైడల్ కాస్ట్రో- మన కాలపు అత్యున్నత నాయకులలో ఒకరు. ఆయన పేరే సామ్రాజ్యవాద వ్యతిరేక స్పూర్తికి, సాహసానికి సంకేతం. జీవిత సంధ్యా సమయంలో కాస్ట్రో తన అనుభవాలను నెమరేసుకుని అందించిన స్మృతుల సంకలనమిది. బాల్యం, విద్యార్థి దశలో యూనివర్సిటీలో నడిపిన ఉద్యమాలు, యువకుడుగా తన ఆలోచనలను, అనుభవాలను నిర్మొహమాటంగా వివరిస్తారు. కొలంబియాలో అంతర్జాతీయ విద్యార్థి మహాసభ కోసం వెళ్లిన కాస్ట్రో అనుకోకుండా అక్కడ పెల్లుబికిన ప్రజా వెల్లువలో భాగస్వామి కావడం, వారితోపాటు వీరోచితంగా నిలబడి నేర్చుకున్న పాఠాలు, తర్వాత క్యూబాలో విప్లవ విజయానికి వాటిని వినియోగించడం సవివరంగా తెలియజేస్తారు. అనుభవాలతోపాటు ఆలోచనల పరిణామాన్ని కూడా ఆయన పంచుకుంటున్నారు.. చదవండి!

About the Author

This Book Was Written By Various Authors