Price: Rs.100.00 /-
No.Pages: 192.
మహాకవి శ్రీశ్రీ సాహిత్య దృక్పథం ఏమిటి? సాహిత్య చరిత్రను ఆయన ఎలా చూశాడు? అసలు తన స్వీయ సాహిత్యానుభవాలు ఎలా వున్నాయి? అనితర సాధ్యమైనంతప్రజాదరణ పొందిన ఆయన రాజకీయ, సామాజిక భావాలేమిటి? వివిధ కథల్లో అవి ఎలాంటి మార్పులు పొందాయి? ఆయన మాటల్లోనే తెలియజేసే సంకలనం. ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూల మేలిమి కూర్పు.
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు తెలుగు బ్రహ్మ్ణ్ణణ కుటుంబము లో విశాఖపట్టణము లో జన్మించాడు. (శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను 30 ఏప్రిల్ 1910 లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 02-1-1910 అని రాయించారని పేర్కొన్నారు) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ . శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.