నవతెలంగాణ బుక్స్ :: ఓ తొలి కమ్యూనిస్ట్

ఓ తొలి కమ్యూనిస్ట్(MUZAFAR AHMED O TOLI COMMUNIST)

Author: Suchetana Chattopadhyaya

Price: Rs.150.00 /-

No.Pages: 344.

Book Your Orders via Whatsapp

Description:

భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అధ్యుల్లో ఒకరు ముజఫర్ అహ్మద్. ఉద్యమంలో అయన తోలి సంవత్సరాల (1913-29) అనుభవాలను వివరిస్తుంది ఈ పుస్తకం. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ ఆవిర్భావం అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదవదగినది ఈ ప్రచురణ. కమ్యూనిస్ట్ ఉద్యమ తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, వారి త్యాగాలను అర్ధం చేసుకోవడానికి, వారినుండి నేటి తరం కమ్యూనిస్ట్ లు స్పూర్తి పొందడానికి ఉపయోగపడేది ఈ పుస్తకం.   ఈ పుస్తకం మొదటి అధ్యాయం (1913-21) ముజఫర్ కలకత్తా నగరానికి వలస రావడానికి సంబందించినది. అయన గ్రామీణ నేపధ్యాన్ని కూడా వివరిస్తుంది. రెండవ అధ్యాయం (1919-21) కలకత్తా నగరంలో కార్మికోద్యమం వెల్లువెత్తిన సందర్భంలో ముజఫర్ వామపక్ష రాజకీయాలకు పరివర్తన చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మూడవ అధ్యాయం (1922-24) ముజఫర్ అహ్మద్ నిర్మాణ సారధిగా కలకత్తాలో మొదటి సోషలిస్ట్ కేంద్రం ఎర్పడటాన్ని వివరిస్తుంది. ఈ కాలంలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తో అయన సంబంధాలు, నిషిద్ద సోషలిస్టు సాహిత్య ప్రచారం, కాన్పూర్ కుట్ర కేసు నిందితులు, ఇతర వలసవాద వ్యతిరేక వామపక్ష వాదులతో అయన పరిచయాలు మొదలైనవి ఈ  అధ్యాయంలో ఉంటాయి. నాల్గవ అధ్యాయం (1926-29) లో బెంగాల్ లో మొదటి సోషలిస్ట్ సంస్థ అభివృద్ధి, కార్యకలాపాలు, వాటిలో ముజఫర్ పాత్ర గురించిన వివరణ ఉంటుంది. చివరిగా, వలసపాలన కాలంలో నగర వాతావరణంలో సోషలిస్టు రాజకీయాల పరిణామానికి ఒక ఉదాహరణగా ముజఫర్ ఎలా ఉన్నాడో వివరించబడుతుంది.

About the Author