Price: Rs.120.00 /-
No.Pages: 152.
భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ.300 వరకు గడచిన ఒక వైవిధ్యభరితమైన దశను ఈ గ్రంథం కూలంకషంగా శోధించింది. 500 ఏళ్ళ ఈ సుదీర్ఘ కాలంలో ఇండో – గ్రీకులు, శకులు, కుషాణులు, శాతవాహనులు ఈ దేశ రాజకీయ రంగంలో ఎలా ప్రాబల్యం వహించారు, ఆర్థిక వ్యవస్థను వారే తీరుగా ప్రభావితం చేశారు... అనే అంశాలను అనేక చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా ఇది సునిశితంగా విశ్లేషిస్తుంది. చరిత్రలోని ఈ దశలో ముఖ్యమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. వృత్తులు, ఉత్పత్తులు, వర్తకవాణిజ్యాలు పలు రకాల ప్రభావాలకు లోనయ్యాయి. (కుల వ్యవస్థ, సాంస్కృతిక మార్పులను ప్రత్యేకంగా వేరే వాల్యూములో ప్రస్తావిస్తామని రచయిత చెప్పారు). ఈ వాల్యూములోని సమాచారం అంతా కూడా తాజా వనరుల ఆధారంగా చేసుకున్నది కావటం ఒక ప్రత్యేకత. ఈ సిరీస్ లోని ఇతర వాల్యూములలో మాదిరిగానే ఆయా శాసనాల అనువాదాలు, మూల గ్రంథాల నుంచి ఉటంకింపులు ప్రతి అధ్యాయం చివరా మరింత వివరమైన సమాచారం కోరుకునే పాఠకుల కోసం ఇవ్వబడినాయి. పురాణాల మీద, ‘సంగం’ తమిళ గ్రంథాల మీద, కుషాణుల కాలక్రమణిక మీద, అలాగే పురాతన నాణాల మీద, ఆర్థిక శాస్త్ర ప్రాథమిక భావనల మీద ప్రత్యేకంగా నోట్స్ ను కూడా రచయిత సమకూర్చారు. వీటికి అదనంగా ఇచ్చిన ఏడు మ్యాపులు, ఇరవైనాలుగు చిత్రాలు – ప్రధానంగా నాణాలు, శిల్పాలకు సంబంధించినవి – పాఠకుల అవగాహన పెంచడానికి మరింతగా తోడ్పడతాయి.