నవతెలంగాణ బుక్స్ :: రామాయణ విషవృక్షం

రామాయణ విషవృక్షం(RAMAYANA VISHAVRUKSHAM)

Author: Ranganayakamma

Price: Rs.250.00 /-

No.Pages: 746.

Book Your Orders via Whatsapp

Description:

'రామాయణ విషవృక్షం' మొదట్లో 3 భాగాలుగా (మూడు వేరు వేరు పుస్తకాలుగా) ఉండేది. 'విషవృక్షం'లో మొదటి భాగాన్ని రచయిత్రి 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రచించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి భాగం ఏడు ముద్రణలూ, రెండవ భాగం ఆరు ముద్రణలూ, మూడవ భాగం నాలుగు ముద్రణలూ వచ్చాయి. 2005 నుంచీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోయాయి. అన్ని భాగాలు కలిసిన సంపుటం ఇప్పటికి మూడు సార్లు ముద్రణలు పడింది: 2006 అక్టోబరులోనూ, 2008 మేలోనూ, 2012 ఫిబ్రవరిలోనూ. 2012 ఫిబ్రవరి ముద్రణలో, గతంలో లేని కొత్త వ్యాసాలు 3 చేరాయి. ఇది 2012 ఫిబ్రవరి ముద్రణకు డిజిటల్ రూపం. \"పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు\" అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది 'పాత' కాదు. 'పాత' అయిపోలేదు. 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు 'రామనామ జపాన్ని' పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు - ఆ గ్రంథం 'పాతదైపోలేదని' నిర్ణయించడానికి! ఈ ప్రయత్నానికి అర్థం - పాతనంతా తిరస్కరించడం కాదు. 'పాత' అంతా మానవ చరిత్రే. ఆ 'చరిత్ర పరిణామం'లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.

About the Author