నవతెలంగాణ బుక్స్ :: మతం మతమౌఢ్యం మార్క్సిజం

మతం మతమౌఢ్యం మార్క్సిజం(MATHAM MATHAMOUDYAMAM MARXIZAM)

Author: Sitaram Yechuri

Price: Rs.20.00 /-

No.Pages: 40.

Book Your Orders via Whatsapp

Description:

భూస్వామ్య సంస్కృతి తెచ్చిపెట్టిన విలువలు, పెట్టుబడిదారీ విధానంలో పుట్టుకొచ్చిన క్షీణ విలువలు కలిసి నేటి సమాజంలో నేర ప్రవృత్తిని పెంచాయి. ఇవి కుల`మతతత్వాలతో కలగాపులగమై పాలక వర్గాల రాజకీయ`ఎన్నికల ప్రయోజనాల్ని నెరవేర్చటానికి ఉపయోగ పడుతున్నాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో నెలకొన్న ఈ పరిణామాలే నేడు మతతత్వ శక్తులకు లాభదాయకంగా తయారయ్యాయి. వ్యవస్థలోని సంక్షోభం`ఫలితంగా ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి పెరుగుతున్నది. మధ్యతరగతి ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని మనం చూస్తూనే వున్నాం. గతంలో దోపిడీకి గురై ఆ తరువాత పై తరగతికి నిచ్చెన ఎక్కినవారు కాదు ఈ మధ్య తరగతి వర్గం. దోపిడీకి గురైన వారి తాజా రూపమే వీరు. నిన్నటి రోజుల్లో దోపిడీకి గురైనవారు, ప్రస్తుత మధ్య తరగతి వర్గం వారి అసంతృప్తి, తత్కారణంగా రూపొందిన మనః స్థితి కలగలిసి ఇప్పుడు మతతత్వ శక్తులకు ఊతంగా తయారయ్యింది. జన బాహుళ్యంలోని ఈ అసంతృప్తిని వాడుకొని తమ రాజకీయ ప్రయోజనాల్ని సాధించుకోవాలని మతతత్వ శక్తులు నేడు చూస్తున్నాయి.

About the Author