Price: Rs.70.00 /-
No.Pages: 168.
కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు, మచ్చలేని ప్రజాప్రతినిధి. కడు బీదరికంలో పుట్టి, అంతంత మాత్రం చదువుతో జీవనం కోసం వలసవెళ్ళి మిల్లుకార్మికునిగా జీవితం ఆరంభించిన రాఘవరెడ్డి, వర్గ స్వభావం అంటే ఏమిటో తెలుసుకొని, కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్యకర్తగా, నేతగా ఎదిగారు. నిరంతరం ప్రజల మధ్య మసలుతూ, వారి సమస్యలు ఆకళింపు చేసుకొని, ఆ సమస్యలను అధికారులు పాలకుల వద్దకు నిర్భయంగా తీసుకు వెళ్ళి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆయనను అనేక స్థాయిల్లో తమ ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకొన్నారు. నకిరేకల్లు నియోజకవర్గానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఎంతటి ఉన్నతస్థాయి పదవిలో ఉన్నా, సాధారణ ప్రజలతో ఆయన సన్నిహిత సంబంధాలు యధాతధంగా కొనసాగుతుండేవి.
This Book Was Written By Various Authors