నవతెలంగాణ బుక్స్ :: 'దళిత' సమస్య పరిష్కారానికి

'దళిత' సమస్య పరిష్కారానికి (DALITHA SAMASYA PARISKARANIKI)

Author: Ranganayakamma

Price: Rs.70.00 /-

No.Pages: 344.

Book Your Orders via Whatsapp

Description:

దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు!మార్క్స్ కావాలి! - రంగనాయకమ్మ ''అంబేద్కర్‌ ద్వారా దళితులకు అందినదంతా - రిజర్వేషన్ల దాస్యమూ మతమౌఢ్యమూ మాత్రమే''. ''అంబేద్కరు పాలకవర్గంలో తన ఇష్టంతోనే ఇమిడిపోయిన విద్యావంతుడు! దారి తప్పిన మేధావి!'' - కోట్లాది దళితులకు మూర్ధన్యుడైన అంబేద్కర్‌ పై ఇట్లాంటి నిశిత విమర్శ ఎవరు చేయగలరు? ఒక్క రంగనాయకమ్మ తప్ప! రంగనాయకమ్మ అనగానే రామాయణ విషవృక్షం గుర్తొస్తుంది. ఆమె శైలి కలం ములికి కంటే కూడా కొస్సవ. దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు! మార్క్‌ ్స కావాలి! అన్నది ఆమె వాదం. మొత్తం ఇరవై శీర్షికలున్న ఈ పుస్తకం అంబేద్కరిజాన్ని బౌద్దాన్ని దళిత కోణం నుంచి నిశితంగా సమీక్షిస్తుంది. 366 పేజీలున్న ఈ పుస్తకం కేవలం మూడు నెలల్లోనే మూడు ముద్రణలు పొందింది. ధర కూడా చాలా తక్కువ. ''అంబేద్కరైతే హిందువులెందరో గౌరవించే గాంధీని టక్కరీ, మోసకారీ, ఆశపోతూ అంటూ ఇంకా ఎలాగైనా దూషించవచ్చు! కాని అంబేద్కర్‌ని మాత్రం, ఎన్ని తప్పులున్నా దేనికీ విమర్శించకూడదు. ఇది దళిత మేధావుల వ్యక్తిపూజా నియమం! కానీ, ఈ దౌర్జన్య ధోరణి దళిత ప్రజల క్షేమానికే గొడ్డలిపెట్టు'' -రంగనాయకమ్మ గారి పుస్తకంలోని మాటలివి.

About the Author