Price: Rs.100.00 /-
No.Pages: 260.
కాళన్న కలం పదును ఇంత అని చెప్పేందుకు ఎవరూ సాహసించరేమో !! వారి రచనలు శక్తివంతమైనవి. ప్రపంచంలో ఇలా ఇంత గొప్పగా… ఈ సాహితీ జగతి వెల్లివిరిసినంత కాలం అంతలా చెప్పలేదేమో! సిరా గురించి మరియు కలం గురించి… ఒకే ఒక్క సిరాచుక్క… లక్ష మెదళ్ళకు కదలిక… నభూతో న భవిష్యతి… ప్రజా కవి గా పేరెన్నిక గావాలంటే ప్రజల మనోభావాలతో మమేకం కావాలి… సృజియించిన రచనలు ప్రజల మానసాలను మరిపించాలి… ఉద్యమించే ప్రజా గళానికి ఊతమవ్వాలి… పదే పదే ప్రతినోటా పలకాలి… చెవిన పడిన వెంటనే తప్పు చేసినవాళ్ళు ఉలిక్కి పడాలి… ఇలా జరగాల్సినవన్నీ అసంకల్పితంగానే జరిగిపోతుండాలి… అవన్నీ అలా అలా అలవోకగా జరిగిపోయినాయి కాబట్టే…. మనం ప్రజా కవిగా కాళోజి గారు నిలిచారు.