నవతెలంగాణ బుక్స్ :: స్పార్టకస్

స్పార్టకస్(SPARTAKAS)

Author: Howard Fast

Price: Rs.120.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్‌ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్‌ మహాశయుడు ''ఏ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగడానికి అదంతా ఆయనకి దగ్గర చరిత్రే. అందులోకూడా అతని పాత్రలు చరిత్రలో ఉన్న పాత్రలు కావు. కాని, ఇందులోని స్పార్టకసే కాదు, క్రాససే కాదు, వరీనియావే కాదు, ఆఖరికి బేటియాటస్‌ కూడా చరిత్రలో వారితోపాటు ఉన్నవాడే. రెండు వేల సంవత్సరాల క్రిందటి వ్యక్తుల్ని మన కళ్ళకి కట్టినట్లు చూపింగలగడమే కాకుండా, ఆనాటి ఆర్థిక రాజకీయ సాంఘిక జీవితాన్ని యావత్తూ కళ్లకి కట్టినట్లు చూపించగలిగారు హోవర్డ్ ఫాస్ట్‌గారు. ఇది నిజాయితీతో రాసిన నవల. ఇది ఆవేదనతో రాసిన నవల. ఇది ప్రయోజనంతో కూడుకొన్న నవల, విప్లవాలనీ వాటి కారణాలనీ నగ్నంగా చూపెట్టే నవల, సామాన్యుడు అనన్య సామాన్యుడెలా అవుతాడో చూపెట్టగలిగిన నవల. ఇది సామాన్య జనానికి సాయుధ విప్లవమే శరణ్యమని నిరూపించి చాటి చెప్పే నవల. ఈ నవల చదువుతూంటే మీరు ఏదో ఒక సైడు ఉంటారు. ఉండక తప్పదు. లోకంలో మనిషికి నిత్యావసరమైన వస్తువులన్నింటినీ మనుష్యుల్లో కాయకష్టం పడేవాళ్లే ఉత్పత్తి చేస్తుంటారు. ఆ శ్రమ ఫలితం మాత్రం వాళ్లకి ద్కదు. అది స్పష్టంగా అందరికీ కనిపిస్తున్నదే. కాని, అలా దక్కకపోడానికి కారణం రాముడిమీదో, రహీముమీదో, లేక పూర్వజన్మల మీదో, మరి దేనిమీదో తోసేస్తారు. అలా ఎవరు తోసేస్తారు? అని ప్రశ్నిస్తే, ఆ శ్రమపడేవారి కష్టఫలితాల్ని ఎవరైతే దోచుకొంటున్నారో వారే నని సమాధానం చెప్పవలసి ఉంటుంది. దోపిడీ చేసే వర్గాలే దాదాపు ప్రతి దేశంలోనూ పాలకవర్గాలుగా ఉంటూ వస్తున్నాయని చరిత్ర ఏమాత్రం చదువుకున్నా మనకి తెలుస్తుంది. మనం ఎవరి కష్టంమీదైతే బతికేస్తామో, ఎవరి కష్టం తాలూకు ఫలితాన్నయితే దోచుకుంటామో వారిని గడ్డిపోచల్లా చూస్తాం. వారిని చూసి అసహ్యించుకుంటాం. వారు మనకంటే బలహీనులనో, తెలివితక్కువ వారనో, మనకంటె నల్లగానో తెల్లగానో ఉన్నారనో, మనకంటె తక్కువ జాతివారనో మనకి మనం చెప్పుకొని, ఆ కారణం వల్లనే వారి అవస్థ అలా ఉన్నదని సమాధానాలు చెప్పుకొని, వాళ్ళ ''తక్కువ'' తనానికి తప్పుడు కారణాలు అంటగట్టి, మన దోపిడీని మట్టుకు నిరాటంకంగా సాగించుకొందికి మనం సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాం.

About the Author