నవతెలంగాణ బుక్స్ :: విశ్వంభర

విశ్వంభర(VISWAMBHARA-DR C.NARAYANA REDDY)

Author: Dr. C. Narayana Reddy

Price: Rs.60.00 /-

No.Pages: 83.

Book Your Orders via Whatsapp

Description:

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌, లెనిన్‌, మార్క్స్‌, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి! కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి! ఆదిమదశనుంచీ ఆధునికదశవరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలో ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. 'విశ్వంభర' కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది.

About the Author