నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణ పదకోశం

తెలంగాణ పదకోశం (TELANGANA PADAKOSAM)

Author: Nalimela Bhaskar

Price: Rs.150.00 /-

No.Pages: 171.

Book Your Orders via Whatsapp

Description:

నేనెవరిని? నా జన్మభూమి ఏది? నా మాతృభాష ఏమిటి? నేను పుట్టి పెరిగిన ఊళ్ళో మాట్లాడిన భాష, ఊపిరి తీసుకున్న శ్వాసలేవి? నా బాల్యంలో నేను నా మిత్రులతో ముచ్చటించిన మాటలేవి? అన్నీ ఏమైపోయినై? నా భాషకు నేనే ఎంతగా పరాయివాణ్ణయ్యాను? జన్మనిచ్చిన తల్లితో సంభాషించి, కడుపు గట్టుకొని సాది సంరక్షించిన తండ్రితో ముచ్చటించి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన మిత్రబృందంతో అలవోకగా సల్లాపించిన నా సమస్త పదజాలం ఎక్కడ మరుగున పడింది? తొక్కు పలుకుల నుండి, నాకు ఊహ తెలిపిన నాటి నుండి నాలో ఒక అవిభాజ్య అంగమై నా మాట యివాళ నా నోటే యింతగా తత్తరపడుతూ తడబడుతున్నదెందుకు? అన్నీ ప్రశ్నలే!

About the Author

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపురంకు చెందిన డా.నలిమెల భాస్కర్ తెలుగు ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాలకు, ఆయాభాషలకు వనంతెనలాంటివారు. పద్నాలుగు భాషలలో లోతైన పరిచయం గల భాస్కర్ తెలుగు నుంచి ఇతర భాషల నుంచి తెలుగుకు అనువాదాలు చేసారు. "అద్దంలో గాంధారి" అనే అనువాద కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందారు. "స్మారకశిలలు" అనే మళయాలీ నవల అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఇంకా అనేక అవార్డులు పొందారు. "సుద్దముక్క" కవితా సంపుటి. ప్రత్యేకంగా తెలంగాణ భాషపై ఒక పరకోశాన్ని రూపొందించారు. ఇప్పటికి మూడు ముద్రణలు పొందిన పుస్తకం ఇది. "బాణం" తెలంగాణా భాషా వ్యాసాలు. "మంద" మరి పదకొండు కథలు మరో అనువాద కథా సంపుటి.