నవతెలంగాణ బుక్స్ :: మహాత్మ జ్యోతిరావు పులే

మహాత్మ జ్యోతిరావు పులే (MAHATHAM JYORTHIRAO PULE JEEVITHA CHARITRA)

Author: Various

Price: Rs.150.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

నిమ్నకులాల వారికోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రధమంగా పాఠశాలలు స్ధాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షను, సాంఘిక దోపిడీని, మూడనమ్మకాలను...వాటికి కేంద్రబిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావ్‌ పులే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం. నిన్నమొన్నటి వరకు మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది. స్త్రీలైతె ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడి వుండాల్సిందే. విద్య మీద, రాజ్యం మీద, మతం మీద బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం. ''ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం, న్యాయం అంటూ వారు బోధించే నీతులన్ని వారి ఆధిపత్యం కొరకే''....అన్నట్టుగా నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుం బిగించాడు పులె. ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు. అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్ధను నిర్మూలించేందుకు ఉద్యమించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్మిక, కర్షకుల హక్కులు, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మనీయ దోపిడిని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ పులే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్‌ ఆంబేద్కర్‌ వంటి ఎందరో మహానీయులకు స్ఫూర్తినిచ్చింది. హిందూ మతోన్మాదం ''మతభక్తే - దేశభక్తి'' అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో ఉంది.

About the Author

This Book Was Written By Various Authors