Price: Rs.60.00 /-
No.Pages: 96.
విద్యా రంగం అనేది ఏ సమాజంలోనైనా కీలక పాత్ర వహిస్తుంది. విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజికంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తలిదండ్రులకూ, పెద్దలకూ పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడ నిరంతరం చర్చనీయాంశంగా వుంటుంది.ఇవన్నీ మౌలిక విలువలకు సంబంధించిన ప్రశ్నలను ముందుకు తెస్తాయి. భారత దేశ చరిత్రలో కీలక పాత్ర వహించిన మహానేతలు దార్శనికులు ఈ విషయమై వెలిబుచ్చిన అభిప్రాయాల సమాహారమే ఈ పుస్తకం. పరిస్థితులలో మార్పు వున్నప్పటికీ వారి భావాలు తెలుసుకోవడం ఆసక్తికరమే గాక మార్గదర్శకం కూడా అవుతుందన్న విశ్వాసంతో ఈ పుస్తకం అందిస్తున్నాం. భవిష్యత్తులో మరికొందరి భావాలను కూడా జతపర్చగలమని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ నేతల భావాలను అందించిన వారికి, ఈ సంకలనంలో పొందుపర్చిన రచనల సేకరణకు దోహదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు.
This Book Was Written By Various Authors