నవతెలంగాణ బుక్స్ :: మఖ్దూం మొహియుద్దీన్ జీవితం - కవిత్వం

మఖ్దూం మొహియుద్దీన్ జీవితం - కవిత్వం(MAKDHOOM MOHIYUDDIN)

Author: Vahed

Price: Rs.300.00 /-

No.Pages: 488.

Book Your Orders via Whatsapp

Description:

మఖ్దూం పేరే ఒక ఉత్తేజం. మఖ్దూం మొహియుద్దీన్ ఓ కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడు. అంతే సమానంగా ఓ అద్భుతమైన కవి. మఖ్దూంలో కమ్యూనిస్టు, కవి - రెండింటి మధ్య అవినాభావ, అవిభాజ్య సంబంధం ఉంది. ఆయన రాజకీయ కార్యకలాపాలను మాత్రమే శ్లాఘించేవారు, ఆయన కవిత్వం జోలికి పోకుండా ఉంటే కమ్యూనిస్టుగా మరిన్ని సేవలు అందించే వారని భావించేవారు. ఓ కవిగానే ఆయనను గుర్తించినవారు రాజకీయాలు లేకుంటే ఆయన మరింత గొప్ప కవిత్వం అందించేవారని అనుకునేవారు. కాని ఆయనలో కవి, కమ్యూనిస్టు ఒక్కరే. ఒకరు లేకుండా మరొకరు లేరు.మఖ్దూం గురించి ఇప్పటివరకు వెలువడిన సాహిత్యంలో ఆయనలో ఏదో ఒక్క పార్శ్వాన్ని మాత్రమే అధికంగా చెప్పినవి ఎక్కువ. కాని మఖ్దూం జీవితాన్ని, కృషిని ఒక కవిగా, కమ్యూనిస్టుగా సమపాళ్లలో, సమగ్రంగా వివరించడానికి ఓ గొప్ప ప్రయత్నం చేశారు అబ్దుల్ వాహెద్ ఈ పుస్తకంలో. ఎంతో శ్రమకోర్చి సేకరించిన మఖ్దూం కవితలను మూడు విభాగాలుగా చేసి చక్కటి తెలుగు అనువాదాన్ని వాహెద్ అందించడంతో పాటు, అదే కవితలను ఉర్దూ లిపిలో, తెలుగు లిపిలో కూడ ఇవ్వడం ఈ పుస్తకం విశిష్టత. రాజకీయ రంగంలోని, అలాగే కవితారంగంలోని ముఖ్దూం సహచరులు, మిత్రులు రాసిన జ్ఞాపకాల నుండి ఆయన జీవితం గురించి సేకరించిన అపారమైన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అందించడం ద్వారా ఇప్పటివరకు లేనటువంటి ఒక సమగ్రమైన మఖ్దూం జీవిత చిత్రాన్ని మన ముందుంచారు వాహెద్

About the Author