నవతెలంగాణ బుక్స్ :: మా'నవ' వాదం జీవన నినాదం

మా'నవ' వాదం జీవన నినాదం(MANAVA VAADAM JEEVANA NINADAM)

Author: Dr. Devaraju Maharaju

Price: Rs.125.00 /-

No.Pages: 216.

Book Your Orders via Whatsapp

Description:

మనిషి మనిషిగా ప్రవర్తించినప్పుడు.. మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు సమస్యలు రావు. దాన్ని మనం ఈ అత్యాధునిక వైజ్ఞానిక సమాజంలో సాధించాల్సి వుంది. విభజనలు మాని, సమానత్వం కోసం, మానవళి ఐక్యత కోసం, మానవత్వ స్థాపన కోసం కృషి చేయాల్సి వుంది. మనిషి బలహీనతకూ బలానికీ మధ్య ఘర్షణ, మనిషి మూఢవిశ్వాసనికీ ఆత్మవిశ్వాసనికీ ఘర్షణ, భ్రమలకూ వాస్తవాలకూ మధ్య ఘర్షణ, అయితే ఒకటి మాత్రం నిజం! మనిషి తన బలహీనతల మీద, అజ్ఞానం మీద, అమాయకత్వం మీద, మూఢత్వం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడితే సమాజం ఇంత ప్రగతిపథానికి వచ్చేది కాదు. వాటన్నింటినీ పూర్తిగా పక్కకు నెట్టేస్తూ వచ్చాడు. కాబట్టి, నేటి ఈ ఈరవై ఒకటవ వైజ్ఞానిక శతాబ్దంలోకీ అడుగుపెట్టాడు. ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు గత యాబైయేళ్ళకు పైగా రచనలు ప్రకటిస్తూనే వున్నారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో సుమారు అరవై రెండు ప్రమాణిక గ్రంథాలు ప్రకటించిన ఈ రచయిత, నాలుగు జీవన సాఫల్య పురస్కారాలందుకున్నారు. అందులో సరళ వైజ్ఞానిక రచనలకు అందుకున్నది కుడా ఒకటి! మూఢనమ్మకాలు నిర్మూలనకు తన కలం కొరడా ఝులిపిస్తూనే, సమాజంలో హేతుబద్దత, సామాన్యుడితో శాస్త్రీయ అవగహన పెరగాలని నిరంతరం తపిస్తున్న నిత్యకృషీవలుడు.

About the Author