Price: Rs.200.00 /-
No.Pages: 360.
అతడొక కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్ఠి చేకూర్చాడు. రెండు దశాబ్దాల కింద మూగబోయిందతని శరీరం. కానీ కవిత్వం మాత్రం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే తచ్చాడుతున్నది. శ్రీ శ్రీ తరువాత అంత ఎక్కువగా 'కోట్' అయిన కవిత్వం ప్రభాకర్ దే. వర్తమాన కవిత్వానికి 'కాయినేజ్' పెంచిన కవీ ఇతనే. రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ ఇమిడ్చాడు. సమాజ మార్పుని అకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి. 'మరణం తన అంతిమ చిరునామా అని ప్రకటించాడు. రోజు రోజుకి అతని కవిత్వానికి రెలవెన్స్ పెరుగుతోంది. అందుకే ఈ ప్రచురణ.
This Book Was Written By Various Authors