Price: Rs.60.00 /-
No.Pages: 48.
బుడ్డోళ్ళ కథలు -6 : బుర్రల నిండా పుస్తకాలను కూరుకుని, కండ్ల ముందు సూత్రాలు సయ్యాటలాడుతుంటే, విద్యార్ధులు చదువును శిక్షలా భావించే పిల్లల కోసం ఒక ఆటవిడుపులాగ, వెన్నులరాత్రుల్లో ఆడపిల్లలు వెన్నెల కుప్పలుపోసి ఆడుకుంటున్నట్లు, గొడ్లకాడ పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతూ దంకులు పెట్టినట్లు, మానసిక ఉల్లాసాన్ని, ఎగసిపడే ఆనందాన్ని, చమత్కార సౌరభాన్ని, బిగదీసుకున్న పెదవుల మీద ఒక దరహాసచంద్రికను విరిసేలా చేస్తాయి ఈ కథలు, బాలలకు నైతిక విలువల్ని, మానసిక చైతన్యాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, శ్రమజీవుల పట్ల కారుణ్యాన్ని, విశాల భావాల విస్తృతిని, భవిష్యత్తుపై నమ్మకాన్ని అందిస్తాయి. నా కథలు సూటిగా, గుండెల్లో గూడు కట్టుకుంటాయి.