Price: Rs.25.00 /-
No.Pages: .
తెలుగులోని పద్యసాహిత్యం నుంచి సంఘచరిత్రను సేకరించడం కష్టసాధ్యమైన పని. ఇరవయ్యో శతాబ్ది పద్యసాహిత్యం కూడా మన గ్రంథాలయాల దుస్థితి వల్ల ఒక పట్టాన దొరకటం లేదు. దొరికినంతలో అందులోని సంఘచరిత్రను సమర్థించడానికి కావలసిన ఆర్థిక సాంస్కృతిక చరిత్రల్లో ఆధార గ్రంథాలు లభించకపోవడం మరో దయనీయస్థితి ఈ వ్యాసంలో దొరికినంతలో చేతనైనంతలో 1900-1950 మధ్యకాలంలోని తెలుగు పద్య సాహిత్యం ద్వారా తెలియవచ్చే సంఘచరిత్రను వివరించే ప్రయత్నం జరిగింది. చరిత్రాభిమానులూ పద్యకవితాభిమానులూ ఈ వ్యాసాన్ని పరిశీలించి ఇంతకన్నా విపుల గ్రంథరచన చేస్తారని ఆశిస్తున్నాం.