Price: Rs.500.00 /-
No.Pages: 436.
కాళోజి కవితలు చాలా వరకు ఇదివరకే అచ్చయినవి. అచ్చుకానివి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని వీలయినంత వరకు ఒకే ఒక సంకలనంగా తేవాలన్న ప్రయత్నానికి రూపమే ఈ పుస్తకం. ఈ సంకలనం లోపట కాళోజి డైరీలల్ల, నోటు బుక్కుల్ల, చెల్లాచెదరుగా ఉన్న కాగితాలలో రాసుకున్నాయ్, ఇప్పటిదాకా అచ్చుకాని గేయాలు, గీతాలు ఉన్నాయి. వీటన్నింటిని ఒక్క దగ్గర చేర్చి, సరిజూసి, మంచిగున్నయనుకున్న విషయాన్ని ఎన్నుకుని, పునరుక్తుల్ని మినహాయించేటప్పుడు కవితాహృదయానికి భంగం కలగకుండా వీలయిన జాగ్రత్తల్ని తీసుకున్నాం. ఇట్లాంటి సందర్భాల్లో కవి ఉద్దేశించిన అర్థం - భావం చెడకుండా వాక్యాలను, పదాలను, సర్ది రాసి ప్రయత్నం చేశాము. అయితే, కాళోజి కోరిక ప్రకారం ఇప్పటికే ప్రచురించి ఉన్న కవితా సంకలనాల వరుసక్రమం చెడకుండా ఉంచి, మిగిలిన విషయాల్లో మాత్రం కొంత స్వతంత్రంగా వ్యవహరించవలసి వచ్చిందని చెప్పక తప్పదు. ఈ క్రమంలో, కవి యొక్క అభిరుచి, ఆయన సమాజాన్ని పరిశీలించి, ఆయా పరిస్థితులలో స్పందించిన తీరు, బహుముఖమైన కాళోజి వ్యక్తిత్వం పాఠకులు అర్థం చేసుకుంటారనే మా నమ్మకం.