నవతెలంగాణ బుక్స్ :: మీ సత్తా తెలుసుకోవడం ఎలా..?

మీ సత్తా తెలుసుకోవడం ఎలా..? (MEE SATTA TELUSUKOVADAM ELA?)

Author: Gangadhar sirpa

Price: Rs.99.00 /-

No.Pages: 134.

Book Your Orders via Whatsapp

Description:

ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ప్రతిభ ఉంటుంది. సాధన చెయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా అన్నారు. అయితే ఆ ప్రతిభను గుర్తించి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని అద్భుతాలు సాధించిన గొప్ప వ్యక్తులెందరో మన మధ్యనే జీవిస్తున్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పని చేస్తుంటే మన సామర్ధ్యం కూడా దానంతట అదే పెరుగుతుంది. లక్ష్య సాధనకు ఆ సామర్ధ్యం చక్కగా ఉపయోగపడుతుంది. మనలో చాలా మంది తాము ఎందుకు పనికిరామని, తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. మనం చిన్ననాటి నుంచి చదువుకున్న పాఠాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపలేదు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పలేదు. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో దారి చూపలేదు. అందుకే నేడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలను విపరితమైన గిరాకీ ఏర్పడింది. కాలం ఇసుక రేణువుల్లా మన చేతివేళ్ల సందుల్లోంచి జారిపోతుంది. అది మళ్లీ తిరిగిరాదు. ఈ ప్రపంచంలో కాలాన్ని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్లే తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగారు. గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలించినపుడు ఈ విషయం మనకు అవగతమవుతుంది.

About the Author