నవతెలంగాణ బుక్స్ :: మీరు జర్నలిస్టులా?

మీరు జర్నలిస్టులా?(MEERU JOURNALISTULAA ?)

Author: S. Veeraiah

Price: Rs.40.00 /-

No.Pages: 72.

Book Your Orders via Whatsapp

Description:

పాత్రికేయ వృత్తిలో సామాజిక స్పృహను ప్రదర్శించటం ఒక సవాలుగా మారింది. ఇది సాహసంతో కూడుకున్న ప్రక్రియ. ప్రజల పట్ల అంకితభావం, దేశం పట్ల నిబద్ధత, నిజాయితీ కీలకపాత్ర పోషిస్తాయి. సమాజంలో వస్తున్న పరిణామాలను అనునిత్యం అధ్యయనం చేసినపుడు తను నడవాల్సిన మార్గం ఎంచుకోగలరు. అంతేకాదు. పాత్రికేయ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటం, వివిధ సమస్యలు, పరిణామాల పట్ల లోతైన అవగాహన పెంచుకోవటం, రాజకీయ స్పృహ కలిగి వుండటం అవసరం. పాఠకులకు తెలియని సమాచారం తాను తెలుసుకొని అందించటం ఇక్కడ పాత్రికేయుల బాధ్యత. పత్రికా రంగానికి చారిత్రకంగా ఉన్న ఔన్నత్యం రీత్యా పాత్రికేయుల పట్ల గౌరవం ఏర్పడింది. వ్యక్తిగత శక్తి సామర్థ్యాలు, అవగాహన, నైపుణ్యం పెంచుకోవటం, సమాజం పట్ల నిబద్ధతతో పనిచేయటం ద్వారా తాను పొందుతున్న గౌరవానికి అర్హత సంపాదించాలి. ఇలాంటి అంశాలను వివరించి, చర్చకు దోహదపడేదే ఈ చిన్న పుస్తకం.

About the Author