నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణ భాష సాహిత్య వికాసం

తెలంగాణ భాష సాహిత్య వికాసం(TELANGANA BHASHA SAHITYA VIKASAM)

Author: Various

Price: Rs.140.00 /-

No.Pages: 256.

Book Your Orders via Whatsapp

Description:

ఇందులోని నలభై నాలుగు వ్యాసాలలో దాదాపు సగంమంది పరిశోధక విద్యార్థులు రాశారు. 14 మంది అధ్యాపక వృత్తిలో వుంటూనే పరిశోధనాత్మక వ్యాసాలు అందించారు. రచయితలుగా కవులుగా విమర్శకులుగా ఇందులో వుండడం విశేషం. చాలా వరకు తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో వెల్లువెత్తిన సాహిత్య విశ్లేషణలు, పరిచయాలు మనకు కనబడతాయి. ఆనాటి నుండి ప్రత్యేక తెలంగాణ డిమాండ్ తో మొదలైన తొలి, మలి దశ ఉద్యమ సందర్భంగా సాహిత్య పరిచయాలు, విశ్లేషణలు వున్నాయి. నేటి రచయితలు, కవులు, కళాకారులకు ఆనాటీ వారికీ వున్న సామ్యాన్ని కూడా రచయితలు వ్యక్తీకరించారు. తెలంగాణకు వున్న ప్రత్యేకతల్లో ఇక్కడి రచయితలు ఆయా ఉద్యమాల్లో భాగస్వాములుగా వున్నారు. దూరంగా చూసి రచనలు చేయలేదు. వట్టికోట. దాశరథి, కాళోజీ, మగ్దూం , సురవరం, కాంచనపల్లి, సుద్దాల, పరా, సుంకర, వాసిరెడ్డి, షోయాబుల్లాఖాన్, మొదలైన వారందరు సాహిత్య కళారూపాలను సృజించడమే కాక ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న యోధులు. ఈ రకమైన ఉద్యమ సహచరత్వాన్ని నేటి రచయితలు, కవులు, కళాకారులు, ఇంకా అలవర్చుకోవాల్సి ఉంది.

About the Author

This Book Was Written By Various Authors